బస్సుల్లో దొంగతనాలు.. అత్తా కోడలు అరెస్టు
కెలమంగలం: బస్సులో ప్రయాణికుల వద్ద డబ్బులు దొంగలించుకెళ్లిన అత్తా, కోడలిని డెంకణీకోట పోలీసులు అరెస్ట్ చేశారు. డెంకణీకోట సమీపంలోని జారకాలట్టి గ్రామానికి చెందిన మహిళ గత నెల 30వ తేదీన క్రిష్ణగిరిలో బంగారం కొనాలని రూ. లక్ష నగదుతో బస్సులో బయల్దేరింది. బస్సు దిగాక చూసుకుంటే డబ్బులు కనిపించలేదు. డెంకణీకోట పోలీసులకు ఫిర్యాదు చేయగా, బస్టాండు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి, తిరువణ్ణామలై జిల్లాకు చెందిన అలమేలు (45), కోడలు భువన (22)ను అరెస్టు చేశారు. విచారణ చేయగా తామే దొంగతనం చేశామని చెప్పారు. బస్సుల్లో ప్రయాణిస్తూ డబ్బు, బంగారం కొట్టేస్తుంటామని తెలిపారు. వీరిపై కడలూరు, కల్లకురిచ్చి, పెరంబలూరు, సేలం, తంజావూరు, తిరుచ్చి, విళ్లుపురం పోలీస్ స్టేషన్లలో 11 చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.


