బడి.. అసౌకర్యాల ఒడి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం ప్రాధాన్యత, అవసరాన్ని గుర్తించి అందరికీ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు పలు రకాల పథకాలను రూపొందించి అమలు జరుపుతోంది. ప్రత్యేకంగా ప్రజల భాగస్వామ్యంతో పాఠశాలలను నిర్వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని భావించి పాఠశాల స్థాయి నుంచి హైస్కూల్ స్థాయి వరకు విద్యార్థుల తల్లిదండ్రులతో కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఈ కమిటీలతో విద్యా రంగంలో మార్పులు వస్తాయని ఆశించారు. కేవలం పదవులకు మాత్రమే కమిటీలని, ఆశించిన మేర ప్రోత్సాహం కనుమరుగు కావడంతో పేరుకు మాత్రమే కమిటీలున్నా ఫలితం లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలోని పాతబడిన రాయచూరు జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం మరమ్మతులకు రూ.5 కోట్ల నిధులు విడుదల చేసినా పనులు మాత్రం అలాగే మిగిలాయి.
పాఠశాలల్లో కనీస వసతులు కరువు
కళ్యాణ కర్ణాటకలోని ప్రభుత్వ ప్రాథమిక, హైస్కూల్ స్థాయిలో పాఠశాలల్లో కనీస వసతులు కరువయ్యాయి. ప్రతి పాఠశాలలో సమస్యలు తిష్టవేశాయి. ప్రభుత్వ పాఠశాల భవనాల నిర్వహణలో అధికారులు పట్టించుకోవడం లేదు. భవనాలకు తక్కువ మోతాదులో నిధుల విడుదలతో పనులు జరగకుండా పోతున్నాయి. పాఠశాలలో తాగునీటి ఎద్దడి, మూత్రశాలలు, మరుగుదొడ్లు, రక్షణ గోడలు, కిటికీలు, తలుపులు లేకపోవడం విచిత్రంగా ఉంది. ప్రజలు చెత్తాచెదారం వేసి పరిశుభ్రతకు ఆనవాళ్లుగా మారాయి. పాఠశాల పక్కనే మురుగు గుంటలున్నాయి. దుర్వాసన వెదజల్లుతుంటే విద్యార్థులు విద్యనభ్యశించడానికి వెనుకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలకు సెలవులు ప్రకటిస్తే పందులు, పశువులు స్వైర విహారంతో పాటు మరుగుదొడ్డిగా, రాత్రి వేళ బిచ్చగాళ్లకు నిలయంగా మారుతోంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా అంద్రూన్ కిల్లా పాఠశాల భవనం మాత్ర ం శిథిలావస్థకు చేరింది.
కల్యాణ కర్ణాటకలో పాఠశాలలు అధ్వానం
అరకొర సౌకర్యాలతో చదువులు
సాగేదెలా?
పట్టించుకోని పాలకులు,
విద్యా శాఖ అధికారులు
నేటి నుంచి జిల్లాలో ప్రస్తుత విద్యా
సంవత్సరంలో బడుల ప్రారంభం
ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా అభివృద్ధి
ప్రభుత్వం డీపీఈపీ, ఓబీబీ, సాక్షరత, బాల కార్మిక, ఇతర పథకాల పేరుతో రూ.కోట్ల మేర నిధులు ఖర్చు పెట్టినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా విద్యా శాఖ నిర్వీర్యమైంది. విద్యార్థులకు చెట్ల కింద, దేవాలయాల్లో పాఠాలు బోధించే స్థితి నెలకొంది. ఈ నెల 29 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో 250, కొప్పళ జిల్లాలో 222, యాదగిరి జిల్లాలో 158, బీదర్ జిల్లాలో 211, విజయ నగర జిల్లాలో 96, కలబుర్గి జిల్లాలో 258 పాఠశాలలు అధ్వానంగా ఉన్నాయి. ఈ విషయంలో శాసన సభ్యులు, మంత్రులు, లోక్‌సభ సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు మౌనం వహించారు. 4518 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడానికి సర్కార్ ఆదేశాలు జారీ చేయకుండా అతిథి ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయించాలని చూస్తోంది.
బడి.. అసౌకర్యాల ఒడి
బడి.. అసౌకర్యాల ఒడి


