
భక్తిశ్రద్ధలతో వాసవీ జయంతి
బళ్లారి అర్బన్: బెంగళూరు రోడ్డులోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో వెలసిన కన్యకాపరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా బుధవారం విశేషంగా పూజలు నెరవేర్చి నగర వీధుల్లో అమ్మవారిని ఘనంగా ఊరేగించారు. వేలాది మందికి విశేషంగా అన్నదానం చేశారు. ప్రతి రోజు ఉదయం అమ్మవారికి వాసవీ హోమం, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూల అలంకరణ, లక్ష కుంకుమార్చన, పుష్పార్చన, మహామంగళారతి కూడా నెరవేర్చారు. ఆలయ పాలక మండలి, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, భజన సంఘం సభ్యులు కలిసి గంగమ్మను నగరేశ్వర ఆలయం నుంచి ఊరేగింపుగా వాసవీ దేవి ఆలయానికి తీసుకొచ్చారు. విశేష పూజలతో పాటు వాసవీ జయంతికి సత్యనారాయణ స్వామి పూజను నెరవేర్చి భక్తులకు ప్రసాదం వినియోగం చేశారు. ఐదు రోజుల పాటు సాయంత్రం వేళలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖులు గాదెం గోపాలకృష్ణ, గోవిందయ్య శెట్టి, విఠ కృష్ణ కుమార్, అశ్వత్ నారాయణ శెట్టి, జయంతి కిషోర్‌కుమార్, నామా రమేష్, డాక్టర్ రమేష్‌గోపాల్, సొంతా గిరిధర్‌తో పాటు ఆర్యవైశ్య బాంధవులు పాల్గొన్నారు.
హొసపేటెలో...
హొసపేటె: హొసపేటెలో ఆర్య వైశ్య సంఘం కళా దేవత వాసవీ మాత జయంతిని వైవిధ్యంగా జరిపారు. బుధవారం మెయిన్ బజార్‌లోని నగరేశ్వర ఆలయం నుంచి కుటుంబ దేవత వాసవి మాతను పూర్ణకుంభాలతో ఊరేగించారు. వాసవీ జయంతి సందర్భంగా ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే కలశ పూజ, వాసవీ అమ్మవారికి ఊయల కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ యువజన సంఘం స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించింది. డాక్టర్ సోమశేఖర్ శిబిరాన్ని ప్రారంభించారు. సుమంగళులతో వాసవీ దేవికి మడిలక్కి సమర్పణ, తులాభార సేవ, కన్నికాపూజ నెరవేర్చారు. ఉచిత ఎముకల సాంద్రత తనిఖీ పరీక్ష శిబిరం జరిగింది. సమాజంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, సాధకులను సత్కరించే కార్యక్రమాలు జరిగాయి. అరళహళ్లి కుశాల్ కొత్త రథాన్ని వాసవీ దేవి ఆలయానికి అంకితం చేశారు. సంఘం అధ్యక్షుడు కాకుబాళు రాజేంద్ర, ప్రధాన కార్యదర్శి భూపాల్ ప్రహ్లాద్, కోశాధికారి కాకుబాళు శ్రీనివాస్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు
వాడవాడలా భారీ ఊరేగింపులు

భక్తిశ్రద్ధలతో వాసవీ జయంతి

భక్తిశ్రద్ధలతో వాసవీ జయంతి