
మంచినీటిని సక్రమంగా అందించండి
హొసపేటె: కూడ్లిగి పట్టణంలోని 12వ వార్డులో మంచినీటిని సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్ర రైతు సంఘం, గ్రీన్ ఆర్మీ కార్యకర్తలు పట్టణ పంచాయతీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఆ వార్డులోని రామలింగేశ్వర ఆలయ సమీపంలో రోడ్డు పనులు జరుగుతుండగా, పైప్‌లైన్ దెబ్బ తినడంతో వారం రోజులుగా నీటి సరఫరా స్తంభించింది. వెంటనే ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ వారు పట్టణ పంచాయతీ ఇంజినీర్ రామచంద్రప్పకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరమనె మహేష్, తాలూకా అధ్యక్షుడు బానడ మారుతీ, గ్రీన్ ఆర్మీ అధ్యక్షుడు బీ.నవీన్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఫయాజ్, కార్యదర్శి విజయకుమార్, కోశాధికారి హేమంత్ తదితరులు పాల్గొన్నారు.