ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి
రాయచూరు రూరల్: కశ్మీర్‌లోని పహల్గాంలో కాల్పులు జరిపి అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని యరగేర వాసులు డిమాండ్ చేశారు. ఉగ్రదాడిలో అసువులబాసిన వారి ఆత్మశాంతి కోసం శనివారం రాత్రి భజరంగి, యరగేరి గ్రామస్తులు ప్రజలు కొవ్వొత్తులతో ర్యాలీ న్విహించారు. మృతులకు సంతాపం సూచకంగారెండు నిమిషాల మౌనం పాటించారు. భజరంగి అధ్యక్షుడు పవన్ మాట్లాడారు. పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం లభించేలా చూడాలన్నారు. కేంద్రం సర్కార్ ఈ వి షయంలో ప్రత్యేక విచారణ చేపట్టి తప్పు చేిసిన వారికి ఊరి శిక్షలు వేయలన్నారు. ర్యాలీలో సంతోష్ రెడ్డి, రాము, ఉదయ్ కుమార్, ఆకాష్ రెడ్డి, ప్రవీణ కుమార్ పాల్గొన్నారు.
ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి


