
పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో రోజురోజుకు ఎండవేడిమి అధికం అవుతోంది. కళ్యాణ కర్ణాటకలోని యాదగిరి, కలబుర్గి, రాయచూరు జిల్లాల్లో గత రెండు రోజుల నుంచి ఎండలు తీవ్రం కావడంతో ప్రజలు ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. అంగళ్లు మూసివేసుకొని ఇళ్లలో సేద తీరుతున్నారు. రాయచూరులో మంగళవారం 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని జిల్లాధికారి నితీష్ తెలిపారు. యాదగిరిలో 44.5, బీదర్‌లో 44.4, కలబుర్గి, బాగల్‌కోటలో 43.5, విజయపుర, బెళగావి, కొప్పళ, గదగ్‌ల్లో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
రోజురోజుకు ఎండ వేడిమి అధికం
ఉక్కపోతతో నగర ప్రజలు విలవిల

పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు

పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు