హొసపేటె: మనం సంపాదించిన ఆస్తి, హోదా శాశ్వతంగా ఉండదని, కానీ నేర్చుకున్న జ్ఞానం మాత్రమే చివరి వరకు మీతో ఉంటుందని కొట్టూరు సంస్థాన మఠం శ్రీ జగద్గురు కొట్టూరు బసవలింగ స్వామి అభిప్రాయపడ్డారు. నగరంలోని ఉన్న ప్రతిష్టత విజయనగర కళాశాల పాత విద్యార్థులు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గురువందన, స్నేహ సమ్మిళన, ప్రతిభా కనబరిచిన పూర్వ విద్యార్థులకు సన్మానం కార్యక్రమంను స్వామీజీ ప్రారంభించి మాట్లాడారు. జీవితంలో ఒక లక్ష్యం, దిశానిర్దేం, గురువు ఆశీస్సులు ఉంటేనే విద్య ద్వారా సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందగలరని అన్నారు. నేడు సమాజంలో మనం మంచి స్థానాన్ని సాధించామంటే, దాని వెనుక ఈ సమాజంలోని ప్రతి ఒక్కరి కృషి ఉంటుందన్నారు. ఈ సమాజం నుంచి మనం పొందిన దానిలో కనీసం కొంతైన సమాజానికి తిరిగి ఇవ్వాలన్నారు. దీని ద్వారా అక్షరాలు నేర్పిన గురువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీరుతుందన్నారు. ఎమ్మెల్యే గణేష్, అన్నపూర్ణ, పాత విద్యార్థుల సంఘం అధ్యక్షులు పీ ఎన్ శ్రీపాద, వీవీ సంఘం నేతలు కణేకల్ మహంతేష్, ప్రిన్సిపాల్ ప్రభుగౌడ, కళాశాల పాలక మండలి అధ్యక్షుడు మల్లికార్జున మట్రి, ఉపాధ్యక్షుడు గోగ్గచెన్నబసవ గౌడ, పాత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.