మొయిలీ కుమార్తె హంస కన్నుమూత | - | Sakshi
Sakshi News home page

మొయిలీ కుమార్తె హంస కన్నుమూత

Jul 1 2024 2:04 AM | Updated on Jul 1 2024 8:50 AM

-

బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు

బొమ్మనహళ్లి: ర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ కూతురు హంస మొయిలీ (46) అనారోగ్యంతో కన్నుమూశారు. పార్టీ పనిపై చత్తీస్‌గడ్‌లో ఉన్న మొయిలీ వెంటనే బెంగళూరుకు చేరుకున్నారు. సోమవారం ఉదయం అంత్యక్రియలు జరుపుతారు. మొయిలీ మూడవ కుమార్తె అయిన హంస సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. 

ఆమె మొదటి నుంచి భరతనాట్య కళాకారిణి. అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 2007లో దేవదాసీల జీవిత చరిత్రతో తమిళంలో నిర్మించిన శృంగారం అనే సినిమాలో ఆమె నటించారు. నాటకాలలోనూ నటించారు, కవితల సంపుటిని కూడా రచిండంతో పాటు యోగా సాధకురాలిగా ఉన్నారు. అయితే గత కొన్ని నెలల నుంచి అనారోగ్యంగా ఉన్న హంస ఇటీవలే బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. అనేకమంది ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తంచేశారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement