
హత్యకు గురైన పూజారి (ఫైల్)
యశవంతపుర: పాతకక్షలతో యువకుడిని హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి బెళగావి జిల్లా గోకాక్ నగరంలో జరిగింది. గోకాక్ పట్టణం ఆదిజాంబవ నగరలో నివాసం ఉంటున్న శానూరు పూజారి (27) హత్యకు గురయ్యాడు. అదే ప్రాంతానికి చెందిన యువకుడి ఇంటిపై మృతుడి బంధువులు రాళ్ల దాడి చేసి బైకు, కారును ధ్వంసం చేశారు. ఒక్కసారిగా కాలనీలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గోకాక్ పోలీసులు భద్రత కల్పించారు.
వ్యక్తి అరెస్ట్
విద్యార్థులకు ఎండిఎంఎని అమ్ముతున్న వ్యక్తిని మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉళ్లాల తాలూకా హరేకళకు చెందిన హసైనార్ అలియాస్ అచ్చు (32)ను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళూరు నగరంలోని పడీల్ ప్రాంతాలలో ఎండీఎంఎ అమ్ముతున్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 12 గ్రాముల ఎండీఎంఎ, రూ.60 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. మంగళూరు దక్షిణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.