రాయచూరులో చైత్రా బాధిత దంపతులు ? | - | Sakshi
Sakshi News home page

రాయచూరులో చైత్రా బాధిత దంపతులు ?

Sep 18 2023 1:02 AM | Updated on Sep 18 2023 9:12 AM

- - Sakshi

రాయచూరు రూరల్‌: చైత్రా కుందాపూర్‌ గ్యాంగ్‌లో వంచనకు గురైన బాధితులు ఒక్కొక్కరే బయటకు వస్తున్నారు. బీజేపీ తరపున ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పిస్తామని కోట్లు వసూలు చేసిన చైత్రాను ప్రస్తుతం పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. తాజాగా రాయచూరు తాలుకా గిల్లేసుగూరు తిమ్మారెడ్డి భార్య గాయత్రి కొప్పళ జిల్లా కనకగిరి ఎస్సీ రిజర్వుడ్‌ క్షేత్రం నుంచి బీజేపీ తరఫున విధాన సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన విశాల్‌ నాగ్‌, బెంగళూరు జీతు, గౌరవ్‌లు టికెట్‌ ఇప్పిస్తామని చెప్పి తిమ్మారెడ్డి నుంచి రూ. 21 లక్షలు తీసుకుని పరారయ్యారు. తమకు రాజకీయ పెద్దలు బాగా తెలుసని బాధిత దంపతులను నమ్మించి డబ్బులు వసూలు చేసుకున్నారు. బాధిత దంపతులు జూలై 19న బెంగళూరు అశోక్‌ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు చైత్రా కుందాపూర్‌ మెడకు చుట్టుకునే అవకాశముంది.

Advertisement
 
Advertisement
Advertisement