పెన్‌డ్రైవ్‌లో బదిలీల దందా: కుమార | - | Sakshi
Sakshi News home page

పెన్‌డ్రైవ్‌లో బదిలీల దందా: కుమార

Jul 6 2023 8:34 AM | Updated on Jul 6 2023 8:38 AM

- - Sakshi

కర్ణాటక: కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న బదిలీ దందాలపై తన వద్ద సాక్ష్యం ఉందని జేడీఎస్‌ మాజీ సీఎం హెచ్‌.డీ.కుమారస్వామి ఒక పెన్‌ డ్రైవ్‌ను చూపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ బదిలీ దందాకు ఆధారాలు విడుదల చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేయడంతో పెన్‌ డ్రైవ్‌ను చూపినట్లు చెప్పారు. బదిలీల దందాకు సంబంధించిన ఆడియో ఉందని, ప్రధాన సాక్ష్యమని చెప్పారు.

సమయం చూసి ఈ పెన్‌ డ్రైవ్‌ను విడుదల చేస్తానన్నారు. తన ఆరోపణలకు ఎమ్మెల్యే దినేశ్‌ గుండురావు కంగారు పడాల్సిన పని లేదన్నారు. నా ఆస్తుల గురించి కూడా ప్రభుత్వం విచారణ చేయించవచ్చు, రాజకీయాల్లోకి రాక ముందు, వచ్చాక నా సంపద ఎంత అనేది తనిఖీ చేయండి అని సవాల్‌ చేశారు. నగరాభివృద్ధి అనేది జరగడం లేదన్నారు. తన గురించి బీజేపీ నేత యడియూరప్ప మంచిగానే మాట్లాడారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement