గూడ్స్‌ నుంచి విడిపోయిన వ్యాగన్లు | - | Sakshi
Sakshi News home page

గూడ్స్‌ నుంచి విడిపోయిన వ్యాగన్లు

Jun 20 2023 7:06 AM | Updated on Jun 20 2023 7:24 AM

విడిపోయి దూరంగా ఉన్న వ్యాగన్లు  - Sakshi

విడిపోయి దూరంగా ఉన్న వ్యాగన్లు

కర్ణాటక: బెంగళూరు నుంచి బళ్లారి వైపు బొగ్గులోడు తో వెళుతున్న గూడ్సు రైలు సోమవారం అనంతపురం జిల్లా రాయదుర్గం పరిధిలో డి.హీరేహాళ్‌ మండలం కల్యం గ్రామం వద్ద ఇంజిన్‌ నుంచి 46 వ్యాగన్లు విడిపోయాయి. ఇంజిన్‌ ఐదు వ్యాగన్లతో వెళ్లిపోయింది.

బొగ్గులోడుతో ఉన్న 46 వ్యాగన్లు కంట్రోల్‌ కాక పట్టాలు తప్పేలా కనిపించాయి. కిలోమీటర్‌ దూరం వెళ్లి నిలిచిపోయాయి. గార్డు వాకీటాకీ ద్వారా ఇంజిన్‌ డ్రైవర్‌కు సమాచారం ఇవ్వడంతో రైలు మళ్లీ వెనక్కు వచ్చి వ్యాగన్లను తగిలించుకుని వెళ్లిపోయింది. ఎలాంటి ప్రమాదం సంభవించక పోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement