అమెరికాలో ఉద్యోగం.. గృహ ప్రవేశం చేసిన ఐదు రోజులకే.. | - | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఉద్యోగం.. గృహ ప్రవేశం చేసిన ఐదు రోజులకే..

Jun 9 2023 6:21 AM | Updated on Jun 9 2023 6:52 AM

 మృతురాలు అశ్విని బంగేరా (ఫైల్‌)  - Sakshi

మృతురాలు అశ్విని బంగేరా (ఫైల్‌)

గృహప్రవేశం చేసిన ఐదు రోజులకే ఓ యువతి ఆత్మహత్య

యశవంతపుర: ఇంటిని కొనుగోలు చేసి గృహప్రవేశం చేసిన ఐదు రోజులకే ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన దక్షిణ కన్నడ జిల్లా ఉళ్లాలలో జరిగింది. ఉళ్లాల ఫరంగిపేటకు చెందిన అశ్విని బంగేరా (25) కుంపల చిత్రాంజలి నగరలో ఇంటిని కొనుగోలు చేసింది. ఉన్నత చదువులు చదివి, అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా తన బంధువుల ద్వారా ఇంటిని కొన్నారు.

నెలన్నర క్రితం ఉళ్లాలకు వచ్చి ఈనెల 3న వైభవంగా గృహప్రవేశం చేశారు. బుధవారం రాత్రి తన స్నేహితుడికి ఐల వ్‌ యూ అని సందేశం పెట్టారు. గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది.

గురువారం ఉదయం స్నేహితుడు వచ్చి తలుపు తట్టగా విషయం బయట పడింది. 20 పేజీల డెత్‌నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి కొనుగోలులో మోసపోయానని, రుణం చెల్లింపులపై బ్యాంక్‌ అధికారులు తనను వేధిస్తున్నట్లు రాసి ఉంది. సమస్యలపై విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉళ్లాల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement