భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ | - | Sakshi
Sakshi News home page

భార్యకు ట్రిపుల్‌ తలాక్‌

Jun 1 2023 12:12 AM | Updated on Jun 1 2023 7:17 AM

- - Sakshi

యశవంతపుర: ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి భర్త తనను మోసం చేశాడని మంగళూరు పట్టణంలోని మంగళాదేవి సమీపంలోని మార్నమికట్టెకు చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహమ్మద్‌ హుసేన్‌ అనే వ్యక్తి మొదటి భార్యను వదిలేసి భర్తకు దూరమైన శబానా అనేమహిళను ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. రెండు నెలల పాటు సంసారం సాగింది.

చేసిన అప్పులు తీర్చటానికి ఆమె వద్దనున్న రూ.10 లక్షల విలువైన బంగార అభరణాలను తీసుకొని ఆమెను పుట్టింటిలో వదిలేశాడు. గర్భిణిగా ఉన్న ఆమెను వేధించి బలవంతంగా మాత్రలిచ్చి అబార్షన్‌ చేయించాడు. ఇటీవల ఆమె ఇంటికి రాగా చితకబాది మూడు సార్లు తలాక్‌ చెప్పి గెంటేశాడు. దీంతో బాధితురాలు ఆస్పత్రిలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement