శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు

Jul 11 2026 1:06 AM | Updated on Jul 11 2026 1:06 AM

● సీపీ గౌస్‌ ఆలం

● సీపీ గౌస్‌ ఆలం

గన్నేరువరం: శాంతిభద్రతల పరిరక్షణ, నేరా ల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకమని సీపీ గౌస్‌ ఆలం అన్నారు. మండలంలోని ఖాసీంపేటలో 9, పారువెల్లలో 8, గునుకులకొండాపూర్‌లో 4 సీసీ కెమెరాలను, వాలీబాల్‌ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కమిషనరేట్‌ పరిధిలోని ప్రతి మూలను సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంచాలన్నదే పోలీసుల ముఖ్య ఉద్దేశం అన్నారు. మరో 700 కెమెరాలు అమర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలన్నారు. పిల్లలు, యువత ఆన్‌లైన్‌ గేమింగ్‌ బారిన పడి డబ్బులు పోగొట్టుకుని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలన్నారు. రూరల్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌, సీఐ బొల్లం రమేశ్‌, ఎస్సై నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement