వీసీ కుర్చీకి వినతి | - | Sakshi
Sakshi News home page

వీసీ కుర్చీకి వినతి

Jul 18 2026 3:41 AM | Updated on Jul 18 2026 3:41 AM

పరీక్షలకు అనుమతించాలని కోరుతూ లా కాలేజీ విద్యార్థులు శుక్రవారం కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ గేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. యూనివర్సిటీలో గత సంవత్సరం నుంచి జరుగుతున్న అటెండెన్స్‌ గందరగోళంలో భాగంగా శుక్రవారం కూడా విద్యార్థులను పరీక్షలకు అనుమతించలేదన్నారు. వీసీ ఆదేశంతో ఎలాంటి ఇటర్నల్‌ అంటెడెన్స్‌ రూల్‌ లేకున్నా కూడా లా విద్యార్థులను అటెండెన్స్‌ అనే ఒక్క బూచిని చూపెట్టి పరీక్షకు అనుమతి నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వీసీ లేకపోవడంతో ఆయన కుర్చీకి వినతిపత్రాన్ని అందజేశారు. యూనివర్సిటీ ప్రధాన గేట్‌ వద్ద 5 గంటలు నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యలను పరిశీలిస్తామని తెలపడంతో నిరసన విరమించారు.

– కరీంనగర్‌సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement