ఒకే విద్యార్థి.. ఒక్క టీచర్‌ | - | Sakshi
Sakshi News home page

ఒకే విద్యార్థి.. ఒక్క టీచర్‌

Jul 17 2026 3:16 AM | Updated on Jul 17 2026 3:16 AM

ఒకే విద్యార్థి.. ఒక్క టీచర్‌

మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని అడ్డరోడ్డులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకేఒక్క విద్యార్థి ఉన్నారడు. మూడో తరగతి చదువుతున్న అతడికి బో ధించేందుకు ఒకే ఉపాధ్యాయుడు ఉండడం గమనార్హం. గొర్రెగుండంలో ఇద్దరు విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, తాటిపల్లి అనుబంధం కొంపల్లె ప్రాథమిక పాఠశాలలో నలుగురు విద్యార్థులకు ఒకరు బోధి స్తున్నారు. అడ్డరోడ్డు పాఠశాలలో గతేడాది ఐదుగురు విద్యార్థులు ఉండగా.. ఈ ఏడాది ఒక్కడే మిగిలిపోయాడు. ప్రతి పాఠశాలలో కనీసం 20మంది విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా నిర్దేశించామని ఎంఈవో నీలగిరి జయసింహారావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement