అమ్మవారికి దొండకాయల మాల అలంకరణ | - | Sakshi
Sakshi News home page

అమ్మవారికి దొండకాయల మాల అలంకరణ

Jul 17 2026 3:16 AM | Updated on Jul 17 2026 3:16 AM

21న జాబ్‌ మేళా

విద్యానగర్‌(కరీంనగర్‌): నగునూర్‌లోని శ్రీదుర్గాభవా నీ ఆలయంలో ఆ షాఢమాసం శా కాంబరీ ఉత్సవా ల్లో భాగంగా గురువారం అమ్మవారి ని దొండకాయల మాలలతో అలంకరించారు. ప్రధానార్చకుడు పవనకష్ణ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఫౌండర్‌ చైర్మన్‌ వంగల లక్ష్మణ్‌, భక్తులు పాల్గొన్నారు.

ఉత్తమ బ్యాంక్‌గా కేడీసీసీబీ

కరీంనగర్‌అర్బన్‌: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ)కి అవార్డు వరించింది. నాబార్డ్‌ స్థాపించి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయంలో గురువారం అవార్డును అందజేశారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకును రాష్ట్రంలోనే బెస్ట్‌ పెర్ఫార్మింగ్‌ డీసీసీబీగా గుర్తించగా, రూరల్‌ డెవలప్మెంట్‌ స్పెషల్‌ సెక్రటరీ దానకిశోర్‌ చేతులమీదుగా అవార్డ్‌ స్వీకరించారు. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డా.నవీన్‌ నికోలస్‌, నాబార్డ్‌ సీజీఎం ఉదయభాస్కర్‌, రిజర్వ్‌ బ్యాంకు రీజినల్‌ డైరెక్టర్‌ చిన్మయి కుమార్‌, కేడీసీసీబీ సీఈవో ఎన్‌.సత్యనారాయణరావు, జనరల్‌ మేనేజర్లు బి.శ్రీధర్‌, మహమ్మద్‌ రియాజుద్దీన్‌, డీజీఎం బ్రహ్మానంద రావు పాల్గొన్నారు.

జాతీయ సదస్సులో కొండపాక ఉపాధ్యాయుడు

వీణవంక: విద్యాబోధనలో హస్తకళల వినియోగంపై సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌(సీసీఆర్‌టీ)నిర్వహిస్తున్న జాతీయస్థాయి శిక్షణలో తెలంగాణ ఉపాధ్యాయ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలో ఈ నెల 8నుంచి 17వరకు జరుగుతున్న సదస్సులో వీణవంక మండలం కొండపాక పాఠశాల ఉపాధ్యాయుడు ముదిగంటి రా జేందర్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి మొ త్తం 11మంది ఉన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ, బోనాల ప్రదర్శన ద్వా రా తెలుగు వారి జీవనశైలిని జాతీయ వేదికపై ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.

నేటి నుంచి క్లస్టర్‌ గేమ్స్‌

చొప్పదండి: జవహర్‌ నవోదయ విద్యాలయంలో శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌ రీజియన్‌ స్థాయి 34వ క్లస్టర్‌ గేమ్స్‌ మీట్‌ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో తెలంగాణలోని పదిహేను నవోదయ విద్యాలయాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. అండర్‌ 14, 17, 19 విభాగాల్లో హ్యాండ్‌బాల్‌, వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పోటీలను ప్రారంభిస్తారని, సంకల్ప్‌ స్కిల్‌ ల్యాబ్‌, మ్యాథ్స్‌ పార్క్‌, ప్రముఖ జాతీయ నాయకులు, శాస్త్రవేత్తల విగ్రహాలను ప్రారంభిస్తారని తెలిపారు.

పవర్‌కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: విద్యుత్‌ లైన్ల పనులు చేపడుతున్నందున శుక్రవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ.గీతాభవన్‌ ఫీడర్‌ పరిధిలోని మంకమ్మతోట, రాంనగర్‌, పద్మనగర్‌, పారమిత స్కూల్‌, రాజీవ్‌ పార్కు, ధన్గర్‌వాడీ స్కూల్‌, లేబర్‌ అడ్డ రోడ్డు ప్రాంతాలతో పాటు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు 11 కె.వీ.ఐబీ ఫీడర్‌ పరిధిలోని కోర్టు చౌరస్తా, పాత డీఐజీ బంగ్లా, ఐబీ చౌరస్తా, సర్కస్‌ మైదానం, పద్మనాయక కల్యాణ మంటపం ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.

విద్యానగర్‌(కరీంనగర్‌): కరీంనగర్‌లోని హెచ్‌కేఎం చారిటబుల్‌ ఫౌండేషన్‌లో ఏజీఎం, డీజీఎం, ప్రొడక్షన్‌ మేనేజర్‌, స్టోర్స్‌ ఇన్‌చార్జి, క్వాలిటీ ఇన్‌చార్జి, క్వాలిటీ ఎగ్జిక్యూటివ్‌, హెల్పర్స్‌, కుక్‌, చెఫ్‌ పోస్ట్‌లకు ఈనెల 21న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై.తిపుపతిరావు తెలిపారు. డిగ్రీతోపాటు హోటల్‌, ఫుడ్‌, హాస్పిటలిటీ, ఫుడ్‌ టెక్నాలజీ అర్హతలున్న వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు సంబందిత ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయంలో హాజరు కావాలన్నారు. వివరాలకు 99633 57250 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement