కరీంనగర్‌రూరల్: తీగలగుట్టపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు మంజూరు చేయాలని, సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ఆక్రమించుకునేందుకు యత్నించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ నాయకత్వంలో ఎర్రజెండాలతో ఇండ్ల వద్దకు వెళ్లారు. ఇండ్ల వద్ద పెరిగిన ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు తొలగించి చదును చేశారు. స్థానికులతో కలిసి ఆక్రమించుకునేందుకు యత్నించగా రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వహయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఇప్పటివరకు పేదలకు పంపిణీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. పార్టీ నగర కార్యదర్శి కె.సురేందర్‌రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పద్మ, అంజలి, కార్యదర్శులు మురళి, సంతోషచారి పాల్గొన్నారు.


