● మధ్యవర్తిపై మైనర్ దాడి
మల్యాల: పెద్దపులి వేషం వేసేందుకు తీసుకున్న అప్పు విషయమై ఇద్దరి మధ్య గొడవ జరుగగా.. వద్దని వారించిన మధ్యవర్తిపై బాలుడు రాడ్‌తో దాడి చేసి గాయపరిచిన ఘటన మల్యాలలో చోటుచేసుకుంది. ఎస్సై సందీప్ కథనం ప్రకారం.. మండలకేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన సఖీనా బేగం బంధువైన రిజ్వాన్ వద్ద అదే కాలనీలో నివాసముంటున్న మైనర్ అప్పుచేశాడు. ఇటీవల మొహర్రం పురస్కరించుకుని మైనర్ పెద్దపులి వేషం వేసేందుకు రూ.700 అప్పుగా తీసుకున్నాడు. ఈ విషయమై ఈనెల 8న రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సఖీనా బేగం భర్త పాషాఖాన్ గొడవ జరిగే ప్రాంతానికి వెళ్లి ఇద్దరిని వారిస్తుండగా.. సదరు మైనర్ ఆవేశంలో సమీపంలోని ట్రాక్టర్ రాడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో పాషాఖాన్ తలకు తీవ్ర గాయమైంది. అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాషాఖాన్ భార్య సఖినా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మైనర్‌ను గురువారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం హబ్సీపూర్‌కు చెందిన దావనపల్లి గవాస్కర్ (37) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గవాస్కర్ చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. కుటుంబసభ్యులు గురువారం ఉదయం పనికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
సింగరేణి కార్మికుడి భార్య..
గోదావరిఖని(రామగుండం): స్థానిక పవర్‌హౌస్‌కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడి భార్య పిల్లలమర్రి రాజేశ్వరి అలియాస్ రేవతి(38) గురువారం వేకువజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్న రాజేశ్వరి గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రి, హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చికిత్స తీసుకున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంటి పైకప్పునకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త సదానందం ఓసీపీ–3లో హెడ్ ఓవర్‌మెన్‌గా పనిచేస్తుండగా, ఒక కూతురు ఉంది. భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్సై అనూష తెలిపారు.
నిప్పంటించుకొని వృద్ధుడు..
కొత్తపల్లి(కరీంనగర్): రేకుర్తి కాళోజీనగర్‌కు చెందిన శంకరోళ్ల గంగారావు (80) అనే వృద్ధుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది బుధవారం అర్థరాత్రి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కొత్తపల్లి పోలీస్ ఇన్‌స్పెక్టర్ బిల్ల కోటేశ్వర్ తెలిపారు. మృతుడి కుమారుడు పురుషోత్తంరావు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు
మహిళ ఆందోళన
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం వె ల్దుర్తి గ్రామానికి చెందిన మహిళ నిహారిక పురుగుల మందు డబ్బాతో గురువారం కలెక్టరేట్‌లో ఆందోళన చేపట్టింది. వివరాలు.. వెల్దుర్తి సర్పంచ్ భర్త తనను వేధిస్తున్నాడని, తనకు తండ్రి వారసత్వంగా ఇ చ్చిన 30 గుంటల భూమిని చదును చేసుకుంటుండగా అడ్డుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తహసీల్దార్ తనకు అనుకూలంగా చె ప్పినా సర్పంచ్ వినడం లేదని ఆరోపించింది. కలెక్టరేట్‌లోనైనా తనకు న్యాయం జరుగుతుందని వచ్చి నిరసన తెలిపింది. అయితే మందు డబ్బా వెంట తెచ్చుకోవడంతో అక్కడే ఉన్న పోలీసులు డబ్బాను లాక్కుని ఇంటికి పంపించారు.


