ఏటీఎంను ధ్వంసం చేసి.. చివరికి.. | - | Sakshi
Sakshi News home page

ఏటీఎంను ధ్వంసం చేసి.. చివరికి..

Jun 25 2024 12:12 AM | Updated on Jun 25 2024 9:43 AM

ఏటీఎంను ధ్వంసం చేసిన దుండగుడు

ఏటీఎంను ధ్వంసం చేసిన దుండగుడు

దొంగ కోసం పోలీసుల గాలింపు

సీసీ పుటేజీ విడుదల

కరీంనగర్: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలోని ఓ ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి దొంగతనానికి యత్నించాడు. ఏటీఎంను ధ్వంసం చేసి చోరీకి విఫలయత్నం చేశాడు. ఏటీఎంలోని సీసీ పుటేజీల ఆధారంగా గుర్తుతెలియని దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

దొంగతనానికి యత్నించిన వ్యక్తి సీసీ పుటేజీ ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. సదరు వ్యక్తిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఏటీఎం పై కప్పును తొలగించి అందులోంచి డబ్బులు తీయడానికి విఫలయత్నం చేశాడు. గంట సేపు ప్రయత్నించి వెళ్లిపోయాడు. క్లూస్‌ టీం పోలీసులు రంగంలోకి దిగి నిందితుని వేలిముద్రలు సేకరించారు. సీసీ పుటేజీ ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించి సమాచారం ఇవ్వాలని ఎస్సై రమాకాంత్‌ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement