ప్రేమ పేరుతో.. కానిస్టేబుల్‌ మోసం చేశాడని ఓ యువతి.. | - | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో.. కానిస్టేబుల్‌ మోసం చేశాడని ఓ యువతి..

Feb 10 2024 1:46 AM | Updated on Feb 10 2024 11:02 AM

- - Sakshi

ఆత్మహత్యకు యత్నిస్తున్న యువతిని అడ్డుకుంటున్న పోలీసులు

కరీంనగర్: ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఎస్పీ కార్యాలయం ఎదుట పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలానికి చెందిన యువతిని కొడిమ్యాల మండలానికి చెందిన కానిస్టేబుల్‌ ప్రసాద్‌ ప్రేమ పేరుతో వంచించి మోసం చేశాడు.

దీంతో ఆ యువతి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయం ఎదుట పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. బాధితురాలిని పట్టణ ఎస్సై మన్మధరావు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇవి చదవండి: పాత కక్షలు.. తల్లిని దూషించాడని..

Advertisement
 
Advertisement
Advertisement