సోషల్ మీడియా పోస్టులే కారణం..
బీఆర్‌ఎస్–బీజేపీ మధ్య పోస్టుల యుద్ధం
కార్పొరేటర్ కుటుంబ ఆడియోను వైరల్ చేసిన బీఆర్‌ఎస్
అభ్యంతర వ్యాఖ్యలతో బీజేపీ కార్పొరేటర్ వీడియో
ప్రత్యక్ష దాడికి సిద్ధమైన ఎమ్మెల్యే అనుచర గణం
క్యాంపు ఆఫీస్ వద్దే అదుపులోకి తీసుకున్న పోలీసులు
కరీంనగర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్:
సోషల్ మీడియా వేదికగా సాగుతున్న బీఆర్‌ఎస్, బీజేపీ రాజకీయ పోరు కరీంనగర్‌లో ప్రత్యక్ష దాడుల దిశగా వెళ్లడం తీవ్ర కలకలం రేపుతోంది. కొంతకాలంగా ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు, ఆరోపణలతో కూడిన పోస్టులు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తుండగా.. తాజాగా ఓ ఆడియో వ్యవహారం ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతకు కారణమైంది. గతంలో ఎమ్మెల్యే కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగిన విషయం మరవకముందే.. ఇపుడు బీజేపీ కార్పొరేటర్‌పై బీఆర్‌ఎస్ శ్రేణులు దాడికి సిద్ధమవడంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సకాలంలో స్పందించడంతో బుధవారం రాజకీయ యుద్ధాన్ని ముందే నివారించగలిగారు.
000000000000000000000000
ఒక వర్గం పోస్టుకు మరో వర్గం కౌంటర్ ఇవ్వడం.. వ్యక్తిగత ఆరోపణలు, పరుష వ్యాఖ్యల వరకు వ్యవహారం వెళ్లడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చింది. గతంలో కాంగ్రెస్–బీజేపీ, తాజాగా బీజేపీ–బీఆర్‌ఎస్ మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కార్యకర్తలు క్షణాల్లో ఒకచోటుకు చేరుతున్న నేపథ్యంలో పోలీసులకు పరిస్థితిని అదుపులో ఉంచడం సవాల్‌గా మారుతోంది.


