కష్టపడి చదవాలె.. కాన్ఫిడెంట్‌గా ఉండాలె | - | Sakshi
Sakshi News home page

కష్టపడి చదవాలె.. కాన్ఫిడెంట్‌గా ఉండాలె

Aug 13 2026 12:51 AM | Updated on Aug 13 2026 12:51 AM

శంకరపట్నం/కరీంనగర్‌ రూరల్‌: కష్టపడి చదివి కాన్ఫిడెంట్‌గా ఉండాలని కలెక్టర్‌ చిత్రామిశ్రా విద్యార్థినులకు సూచించారు. బుధవారం రాత్రి శంకరపట్నం మండలం కేశవపట్నం మోడల్‌స్కూల్‌, కేజీబీవి హాస్టళ్లను తనిఖీ చేశారు. భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్య, విద్యుత్‌దీపాలు, ఫ్యాన్లు పనిచేస్తున్నాయా లేదా అని ఆరాతీశారు. ఏమైనా సమస్యలుటే అధికారుల దృష్టికి తీసుకురావాలని విద్యార్థినులకు సూచించారు. డీఈవో చైతన్యజైనీ, విద్యాశాఖ కోఆర్డినేటర్లు శ్రీనివాస్‌, వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నారు.

‘డబుల్‌’ ఇళ్లకు తక్షణమే మరమ్మతు

కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఆరెపల్లిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు అవసరమైన మరమ్మతులను తక్షణమే చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, ఆర్డీవో షర్మిల, కరీంనగర్‌ రూరల్‌ తహసీల్దార్‌ లక్ష్మీనరసింహారావులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనులు చేపట్టిన ఏజెన్సీ ప్రతినిధులను పిలిపించి ఇళ్ల ప్రస్తుత పరిస్థితిపై వివరాలు సేకరించాలని అధికారులకు సూచించారు. ఇళ్లను త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. లబ్ధిదారులకు ఇళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement