షాక్‌ కొట్టిన కంచె! యువకుడికి.. | - | Sakshi
Sakshi News home page

షాక్‌ కొట్టిన కంచె! యువకుడికి..

Jan 6 2024 1:16 AM | Updated on Jan 6 2024 7:42 AM

- - Sakshi

కరీంనగర్: అటవీ జంతువుల నుంచి పంటను కాపాడేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్‌ కంచె షాక్‌కొట్టి ఓ యువకుడు తీవ్రగాయాల పాలయ్యాడు. చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన నవీన్‌రెడ్డి తన పంటచేల్లోకి వెళ్తుండగా మార్గమధ్యలో ఏర్పాటు చేసిన విద్యుత్‌కంచె షాక్‌తగిలి కాలు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన చుట్టుపక్కల రైతులు యువకుడిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. పంటల రక్షణ పేరిట రామన్నపేట, తిమ్మాపూర్‌ గ్రామాపరిధిలో వేటగాళ్లు కొందరు విద్యుత్‌ కంచెలు ఏర్పాటు చేసిన వన్యప్రాణులను వధిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వన్యప్రాణల వేటగాళ్లను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి చ‌ద‌వండి: ఊపిరి ఉన్నంత వరకు జైల్లోనే

Advertisement
 
Advertisement
Advertisement