సాహిత్య శిఖరం సినారె | - | Sakshi
Sakshi News home page

సాహిత్య శిఖరం సినారె

Jul 30 2026 12:21 AM | Updated on Jul 30 2026 12:21 AM

● కరీంనగర్‌ డిపోకు చేరుకున్న మూడు బస్సులు ● నేడు ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌కల్చరల్‌: విశ్వస్థాయి సాహిత్య శిఖరంగా సినారె నిలబడ్డారని తెలంగాణ రచయితల వేదిక (తెరవే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్ల వెంకటేశ్వర్లు అన్నారు. నగరంలోని ఫిలీంభవన్‌లో బుధవారం జరిగిన 160వ ఎన్నీల ముచ్చట్లలో విజయశ్రీ రచించిన కవితా సంపుటి ‘అమృత పద కుసుమాలు’ ఆవిష్కరించారు. సినారె చిత్రపటానికి నివాళి అరిపంచారు. ‘అమృత పద ‘కుసుమాలు’ పుస్తకాన్ని తెరవే జిల్లా కార్యదర్శి దామరకుంట శంకరయ్య సమీక్షించారు. తెరవే జిల్లా అధ్యక్షుడు సీవీ కుమార్‌ అధ్యక్షత వహించారు. గురుపూర్ణిమ సందర్భంగా కవులు సమకాలీన అంశాలపై కవితాగానం చేశారు. గుండు రమణయ్య, గజేందర్‌రెడ్డి, కరిపె రాజ్‌కుమార్‌, కూకట్ల తిరుపతి, విలాసాగరం రవీందర్‌, నడిమెట్ల రామయ్య, తోటపల్లి జగన్మోహన్‌, నసీరుద్దీన్‌, నెరువట్ల చైతన్య, ఆర్‌ఎల్‌ రెడ్డి, ఇటిక్యాల రాము, పెనుగొండ బసవేశ్వర్‌, జనగాని యుగంధర్‌, బొల్లం బాలకృష్ణ, కొలిపాక ఉపేందర్‌, గాలిపల్లి జగదీశ్‌, రావుల శ్రీనివాసచారి, మరిపల్లి మహేందర్‌, కళ్ళెం లక్ష్మణ్‌, సత్యనారాయణరాజు, తిరుక్కోవెల వెంకటరమణ, తడిగిప్పుల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

సిటీ బస్‌ వస్తోంది

కరీంనగర్‌టౌన్‌: సిటీ బస్సు ఏది శీర్షికన ఈనెల 27న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంత్రితోపాటు ఆర్టీసీ అధికారులు స్పందించారు. కరీంనగర్‌లో సిటీ బస్సులు నడపడానికి రూట్‌ సర్వే నిర్వహించి ఆర్టీసీ ఉన్నతాధికారులకు వివరాలు పంపించగా గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. హైదరాబాద్‌ నుంచి 3 సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను కరీంనగర్‌– 2 డిపోకు అధికారులు పంపించారు. సిటీ బస్సులను బుధవారం బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించనున్నారు.

మంత్రి ఆదేశాలతో..

కరీంనగర్‌ నగరపాలక సంస్థ స్మార్ట్‌ సిటీగా ఎదిగి శివారు గ్రామాలైన మల్కాపూర్‌, రేకుర్తి, కొత్తపల్లి, బొమ్మకల్‌, అల్గునూర్‌, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. దీంతో నగర పరిధి 20 నుంచి 25 కిలోమీటర్లకు విస్తరించింది. ముఖ్యంగా ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు వివిధ పనులపై నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లాలంటే సమయంతో పాటు రవాణా చార్జీల సమస్యలు ఎదుర్కొంటున్నారు. రూ.15తో సాగిపోయే ప్రయాణానికి రూ.30 నుంచి 50 వరకు వెచ్చించాల్సి వస్తోంది. మంత్రి పొన్నం ఆదేశాలతో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ అధికారులు సిటీ బస్సులు తిప్పడానికి నిర్ణయించారు.

మూడు బస్సులు వివిధ రూట్లలో..

కరీంనగర్‌– కొత్తపల్లి(హవేలి), కరీంనగర్‌– చింతకుంట, కరీంనగర్‌ –వాగేశ్వరి కాలేజీ, కరీంనగర్‌– ప్రతిమ మెడికల్‌ కాలేజీ, కరీంనగర్‌– దుర్శేడ్‌, కరీంనగర్‌– మానకొండూర్‌ రూట్లలో నడపడానికి అధికారులు రూట్‌ సర్వే చేసి ఇతర అంశాలపై వివరాలను ఉన్నతాధికారులకు పంపించారు.

గతంలో..

గతంలో కాంగ్రెస్‌ హయాంలో కరీంనగర్‌కు చెందిన సీనియర్‌ నాయకుడు ఎం.సత్యనారాయణరావు ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలో మొదటిసారి కరీంనగర్‌లో సిటీ బస్సులను ఏర్పాటు చేశారు. వాటికి సరైన సమయపాలన పాటించక పోవడం, 15 నిమిషాల దూరం ప్రయాణానికి స్టాప్‌ల్లో గంటల తరబడి ఎదురుచూసే పరిస్థితి నెలకొనడంతో ప్రజల నుంచి సరైన ఆదరణ లభించలేదు. తర్వాత 2016 జనవరిలో జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం ద్వారా కరీంనగర్‌– 1 డిపోకు తొలివిడతగా 17 సిటీ బస్సులు కేటాయించగా అప్పటి రవాణాశాఖ మంత్రి ప్రారంభించగా వాటికి కూడా సరైనా ఆదరణ లేక నిలిపివేశారు.

బస్టాండ్‌ నుంచి..

ప్రస్తుతం కరీంనగర్‌ బస్టాండ్‌ నుంచి బయల్దేరే సిటీ బస్సులు ప్రతీ స్టేజీ వద్ద ఆగనున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆయా రూట్లలో వాటిని తిప్పనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement