కామారెడ్డి అర్బన్: ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఆర్య సమాజాలు ధర్మరక్షణ కార్యక్రమాలు విస్తృ తంగా నిర్వహించాలని, ప్రతి నెల నాలుగో ఆదివారం సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని ఆచార్య సత్యమిత్ర అన్నారు. ఆదివారం కామారెడ్డి ఆర్య సమాజంలో జిల్లా ఆర్యసమాజాల సమ్మేళనం జరిగింది. సమ్మేళనంలో ఇందూరు ఆర్యసమాజం అధ్యక్షుడు విజయ్‌కుమార్, కామారెడ్డి అధ్యక్షుడు కంకణాల కిషన్ మాట్లాడుతూ.. సమాజ ధర్మరక్షణ కోసం దయానందుడు చూపిన మార్గంలో కృషి చేయాలన్నారు. మోతే, చిన్నమల్లారెడ్డి, బ్రహ్మణపల్లి, జంగంపల్లి, ఎర్రపహాడ్, రామారెడ్డి తదితర ఆర్యసమాజాల ప్రతినిధులు మాట్లాడారు. ఆర్యసమాజం ప్రతినిధులు అరుణ, కవిత, అర్వపల్లి రమేష్, హరినాథ్, నాగరాజు, సరస్వతమ్మ, వినోద ఆర్య తదితరులు పాల్గొన్నారు.


