వీహెచ్‌పీ ఇందూర్‌ విభాగ్‌ సత్సంగ్‌ ప్రముఖ్‌గా రాజు | - | Sakshi
Sakshi News home page

వీహెచ్‌పీ ఇందూర్‌ విభాగ్‌ సత్సంగ్‌ ప్రముఖ్‌గా రాజు

Jul 27 2026 1:48 AM | Updated on Jul 27 2026 1:48 AM

వీహెచ్‌పీ ఇందూర్‌ విభాగ్‌ సత్సంగ్‌ ప్రముఖ్‌గా రాజు సైబర్‌మోసగాళ్ల ఉచ్చులో పడొద్దు జాతీయ రహదారిపై నిలుస్తున్న వర్షపు నీరు పేకాట స్థావరంపై దాడి

కామారెడ్డి అర్బన్‌: విశ్వహిందూ పరిషత్‌ ఇందూర్‌ విభాగ్‌ సత్సంగ్‌ ప్రముఖ్‌ గా వీహెచ్‌పీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి బొల్లిరాజు నియమితులయ్యారు. వేములవాడలో శని,ఆదివారాల్లో నిర్వహించిన వీహెచ్‌పీ తెలంగాణ రాష్ట్ర సమావేశంలో వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహమూర్తి ప్రకటించారు. వీహెచ్‌పీ ఇందూర్‌ విభాగ్‌లో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి జిల్లాలుండగా వీటిని సమన్వయం చేసే బాధ్యత తనకు నమ్మకంతో అప్పగించారని రాజు అన్నారు. హిందూ ధర్మ ప్రచారం, సమాజ హితం కోసం పని చేస్తానన్నారు.

ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): సైబర్‌ మోసగాళ్ల ఉ చ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు సూచించారు. ఆదివారం సదాశివనగర్‌ మండల కేంద్రంలో రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. యువత సైబర్‌ మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. గ్రామాల్లో బెట్టింగ్‌ యాప్‌ల వినియోగం, మత్తుపదార్థాలకు బానిస కావడం వల్ల యువత పెడదారిన పడుతున్నారని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ మోసాలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత, నియమాలు పాటించాలన్నారు. ఎవరైనా సైబర్‌మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో సీఐ సంతోష్‌ కుమార్‌, ఎస్సై పుష్పరాజు, ఏఎస్సై జగదీశ్‌, సర్పంచేలు శిరీష, సంగారావు, నరేందర్‌, నాయకులు, యువకులు పాల్గొన్నారు.

బాన్సువాడ రూరల్‌: మండలంలోని కొత్తాబాది గ్రామంలోని బుడిమి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలుస్తోంది. దీంతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. కొత్త రోడ్డు , కల్వర్టు నిర్మించిన అధికారులు వర్షపు నీళ్లు వెళ్లిపోయేలా నిర్మించలేదు. దీంతో భారీవాహనాలు వెళ్ళినపుడు నీళ్ళు పాదాచారులపై, ద్విచక్రవాహన చోదకులపై చిత్తుతున్నాయి. అధికారులు స్పందించి రోడ్డుపై నీరు నిల్వకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

బీబీపేట: మండలంలోని యాడారం శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై నవీన్‌ చంద్ర ఆదివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పక్కా సమాచారం మేరకు యాడారం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో దాడి నిర్వహించగా నలుగురు పేకాట ఆడుతున్నట్లు గుర్తించి అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి రూ.7,662 నగదు, 5 మొబైల్‌ ఫోన్లు, 3 మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని అన్నారు. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్‌ చంద్ర తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement