● 10న ప్రచురించే ఓటర్ల జాబితాను
పరిశీలించాలి
● కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కామారెడ్డి టౌన్/దోమకొండ : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియపై బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన మండల, పట్టణ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఎల్‌వోలు ఇచ్చిన దరఖాస్తు ఫారాలను సరిగ్గా పూర్తి చేయించి సకాలంలో అందజేసేలా చూడాలని సూచించారు. వచ్చేనెల 3వ తేదీ నాటికి పూర్తి చేసిన ఫారాలను బీఎల్‌వోలకు అందజేయాలని, 10వ తేదీన ప్రచురించే ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సమావేశంలో పట్టణ మాజీ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు అర్కల ప్రభాకర్ యాదవ్, హఫీజ్, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, లోలం శ్రీనివాస్, నాయకులు కాసర్ల స్వామి, గోపు నర్సింలు, బల్వంత్ రావు, హన్మాండ్లు, కృష్ణాజి రావు, శశికాంత్, పుల్లూరి సతీశ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే దోమకొండ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో గంప గోవర్ధన్ మాట్లాడారు. సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి బొమ్మెర శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుంచాల శేఖర్, నాయకులు గజవాడ శ్రీకాంత్, అరుట్ల అనిల్‌కుమార్, పాల నాగరాజు, బోరెడ్డి కిషన్‌రెడ్డి, తిరుపతిగౌడ్, రాజిరెడ్డి, ఐరేని రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
పలువురికి పరామర్శ
భిక్కనూరు: మండలంలోని ర్యాగట్లపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ నేత గడ్డం మల్లారెడ్డి అత్తమ్మ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీఆర్‌ఎస్ కార్యకర్త అమృత ఇటీవల ప్రమాదంలో కాలు విరగడంతో పరామర్శించి ఆర్థికసాయం అందించారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సర్పంచ్ భాగ్యమ్మ నీలంరెడ్డి, నేతలు అందె మహేందర్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


