లింబాద్రిగుట్టపై హైకోర్టు న్యాయమూర్తుల పూజలు | - | Sakshi
Sakshi News home page

లింబాద్రిగుట్టపై హైకోర్టు న్యాయమూర్తుల పూజలు

Jul 27 2026 1:54 AM | Updated on Jul 27 2026 1:54 AM

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భీమ్‌గల్‌ లింబాద్రి గుట్టపై లక్ష్మీనృసింహస్వామిని హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం దర్శించుకున్నారు. న్యాయమూర్తులు తంగిరాల మాధవీదేవి, అలిశెట్టి లక్ష్మీనారాయణ, గడి ప్రవీణ్‌కుమార్‌తోపాటు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి గుట్టపైకి రాగా.. ఆలయ ప్రధాన అర్చకులు నంబి పార్థసారథి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట ఆర్మూర్‌ సీనియర్‌ సివిల్‌ కోర్ట్‌ జడ్జి శ్రీదేవి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సరళారాణి, అడిషనల్‌ కోర్టు జడ్జి, భీమ్‌గల్‌ కోర్టు ఇన్‌చార్జి భవ్యశ్రీ, ఆర్మూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌చందర్‌, న్యాయవాదులు గజ్జెల చైతన్య, సూర సురేశ్‌ తదితరులున్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి అర్బన్‌ : టెన్సింగ్‌ నార్కే జాతీయ సాహస పురస్కారం కోసం అర్హులైన వారి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వరగౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2023, 24, 25 సంవత్సరాల్లో సాహస క్రీడాకారులు, పర్వతారోహకులు, ట్రెక్కర్లు, రివర్‌రాఫ్టింగ్‌, స్కూబా డైవింగ్‌, పారాగ్‌లైడింగ్‌, స్కైడైవింగ్‌ తదితర సాహస క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. అర్హులైన వారు ఆగస్టు 20 లోపు భారత ప్రభుత్వ కామన్‌ అవార్‌ుడ్స పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సీ్త్రనిధి డైరెక్టర్‌ పోటీలో స్రవంతి

బీబీపేట: సీ్త్రనిధి రాష్ట్ర డైరెక్టర్‌ పదవి పోటీలో మండల కేంద్రానికి చెందిన మహిళా సంఘం మండలాధ్యక్షురాలు సాదల స్రవంతి బరిలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 20 మంది డైరెక్టర్‌ పదవులకు గానూ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాగా కామారెడ్డి, రాజన్న సిరిసిల్లా జిల్లాలను కలిపి ఒక డైరెక్టర్‌ పదవి కేటాయించారు. దీంతో కామారెడ్డి జిల్లాలోని ప్రతి మహిళా సంఘం మండల అధ్యక్షులు ఓటు వేయనున్నారు. కామారెడ్డి జిల్లా నుంచి స్రవంతి నామినేషన్‌ వేయగా రాజన్న సిరిసిల్లా నుంచి లింగారెడ్డిగారి భాగ్య నామినేషన్‌ వేశారు. వీరిద్దరికి ఇప్పటికే గుర్తులు కూడా కేటాయించారు. స్రవంతికి బ్యాట్‌ గుర్తు రాగా భాగ్యకు బీరువా గుర్తు వచ్చింది. దీంతో ఈనెల 28న సంబందిత నియోజకవర్గాల వారీగా జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి. 29న ఓట్ల లెక్కింపు, ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే కామారెడ్డి జిల్లాలోనే అత్యధిక మండలాలు ఉండి డైరెక్టర్‌ పదవి దక్కించుకునేందుకు అవకాశాలు ఉండగా రాజన్న సిరిసిల్లాలో తక్కువ మండలాలు ఉన్నప్పటికీ నామినేషన్‌ వేయడం గమనార్హం.

సీనియర్‌ బాల్‌బ్యాడ్మింటన్‌

జట్ల ఎంపిక

ఖలీల్‌వాడి: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా పురుషుల, మహిళా క్రీడాకారుల ఎంపికలను నిజామాబాద్‌ నగరంలోని క్రీడా మైదానంలో ఆదివారం నిర్వహించినట్లు అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి శ్యామ్‌ తెలిపారు. ఎంపికలకు ముఖ్యఅతిథిగా అసోసియేషన్‌ అధ్యక్షుడు గడ్డం శ్రావణ్‌రెడ్డి హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఆగస్టు 7 నుంచి 9వ తేదీ వరకు మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి పాలిటెక్నిక్‌ కళాశాలగ్రౌండ్స్‌లో నిర్వహించే 72వ తెలంగాణ రాష్ట్రస్థాయి సీనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడా పోటీలకు జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారన్నారు. ఎంపికై న క్రీడాకారులకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించి తుది జట్టును ఎంపిక చేయడం జరుగుతుందని శ్యామ్‌ తెలిపారు. అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్‌, కోశాధికారి రాజేశ్వర్‌, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ నాగేశ్‌, వ్యాయామ ఉపాధ్యాయులు నరేంద్రచారి, సులోచన, భాగ్యశ్రీ, రూప తదితరులు పాల్గొన్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement