చెక్‌డ్యామ్‌తో మంజీరకు జలకళ | - | Sakshi
Sakshi News home page

చెక్‌డ్యామ్‌తో మంజీరకు జలకళ

Jul 27 2026 1:54 AM | Updated on Jul 27 2026 1:54 AM

బాన్సువాడ : బీర్కూర్‌ పరిధిలోని మంజీర నది చెక్‌డ్యామ్‌ నిర్మాణంతో జలకళను సంతరించుకుంది. అడపాదడప కురిసిన వర్షాలకు నదిలో నీటి నిల్వ స్వల్పంగా పెరిగింది. మంజీర నదిలో చెక్‌డ్యాం నిర్మాణానికి అప్పటి స్పీకర్‌, ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి రూ.28.29 కోట్ల నిధులను మంజూరు చేసి, 2021 జనవరి 28న అప్పటి మంత్రి ప్రశాంత్‌రెడ్డి చేతుల మీదుగా పనులను ప్రారంభించారు. ప్రసుత్తం పనులు పూర్తికావస్తుండడంతో మంజీరలో పారే నీరు చెక్‌డ్యాం వద్ద నిల్వ ఉంది. సుమారు కిలోమీటర్‌ మేరకు నీరు నిల్వ ఉండటంతో మంజీర ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరుణుడిపై ఆశలు పెట్టుకుని వరి నాట్లు వేశారు. వర్షాలు కురవకపోవడంతో మంజీర ప్రాంతంలో చాలా బోర్లు ఎత్తిపోయాయి. చెక్‌డ్యాం కారణంగా నీరు నిల్వ ఉండటంతో భూగర్బజాలాలు వృద్ధి చెంది బోరు బావుల్లో పుష్కలంగా నీరు వస్తదని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement