కామారెడ్డి అర్బన్: పట్టణంలోని కర్షక్ బిఎడ్ కళాశాలలో ఆదివారం డీటీఎఫ్ జిల్లా ఐదవ వార్షిక కౌన్సిల్ సమావేశం, జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. కార్యక్రమానికి డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంతన్ హాజరై, మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లుగా పీఆర్‌సీ అమలు చేయకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలు విస్మరించడమేనన్నారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా దేవులా, ఉపాధ్యక్షులుగా శ్యాంకమార్, సునంద, రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా రాములు, కార్యదర్శులుగా వినోద్, గంగారాం, చిన్నరాజయ్య, గఫర్, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎన్సీ ప్రభాకర్, సరోజిని, ఆడిట్ కన్వీనర్‌గా వంశీధర్, కార్యవర్గ సభ్యులుగా భాగ్యలక్ష్మి, చిన్నస్వామి, అకడమిక్ సెల్ కన్వీనర్లుగా విజయరామరాజు, బాబురావు, లలిత ఎన్నికయ్యారు.


