
జ్ఞానప్రకాశ్‌రెడ్డి సేవలు అభినందనీయం
భిక్కనూరు: సమాజ సేవకుడు, కౌసల్యా దేవి ఫౌండేషన్ చైర్మన్ పెద్దబచ్చగారి జ్ఞానప్రకాశ్‌రెడ్డి అందిస్తున్న సేవలు అభినందనీయం, ఆదర్శనీయమని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేర్కొన్నారు. మంగళవారం జ్ఞానప్రకాశ్‌రెడ్డి తన తల్లిదండ్రుల దీవెనలతో మండల కేంద్రంలోని దళితవాడలో సుమారు రూ.2 లక్షల వ్యయంతో వినాయక మండపం నిర్మించారు. దీనిని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన సొంత డబ్బులతో మండల కేంద్రంలోని బస్టాండ్‌ను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఎలాంటి పదవులు లేకపోయినా సమాజసేవ కోసం ఆయన పాటుపడుతుండడం అభినందనీయమన్నారు. పట్టణానికి చెందిన అందె మహేందర్‌రెడ్డి, తున్కి వేణు, పాల రాంచంద్రం, దేవర లక్ష్మి, తాటికొండ బాబు తదితరులు పాల్గొన్నారు.