
లైన్ ఇన్‌స్పెక్టర్‌ను కాపాడిన జీఎంఆర్ సిబ్బంది
భిక్కనూరు: వరద నీటిలో చిక్కుకున్న ట్రాన్స్‌కో లైన్‌ఇన్‌స్పెక్టర్‌ను జీఎంఆర్ సిబ్బంది కాపాడారు. భిక్కనూరుకు చెందిన గూడురి సతీశ్ కామారెడ్డి పట్టణంలో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తాడు. బుధవారం విధులు నిర్వహించేందుకు తన కారులో కామారెడ్డికి వెళుతున్నాడు. జంగంపల్లి గ్రామశివారులో జాతీయ రహదారిపై నుంచి వరదనీరు ప్రవహించడంతో కారును రోడ్డు పక్కన నిలిపాడు. వరద ఉధృతి పెరగడంతో కారు ముందుకు వెళ్లి రోడ్డు పక్కన ఉన్న గుంతలో దిగబడింది. కారులో ఉన్న సతీశ్ కేకలు వేయడంతో అక్కడ ఉన్నవారు బయటికి రావాలని సూచించారు. దీంతో కారు విండోలో నుంచి బయటకు వస్తుండగా వరద ప్రవాహం పెరిగి సతీశ్ నీట మునిగాడు. అక్కడే ఉన్న జీఎంఆర్ సిబ్బంది వెంటనే నీళ్లలోకి దూకి సతీశ్‌ను ఓడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడారు. దీంతో పలువురు జీఎంఆర్ సిబ్బందిని అభినందించారు.