
సమస్యల పరిష్కారానికి సహకరించాలి
● ఎల్లారెడ్డి డీఎల్‌పీవో సురేందర్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): సమస్యల పరిష్కారానికి గ్రామస్తులు సహకరించాలని ఎల్లారెడ్డి డీఎల్‌పీవో సురేందర్ సూచించారు. బెజుగంచెరువుతండా జీపీ పరిధిలో గల ఎర్రకుంటతండాను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థుల హాజరుకు సంబంధించిన రిజిస్టర్‌ను పరిశీలించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని హెచ్‌ఎం మనోజ్‌కుమార్‌కు సూచించారు. మెనూప్రకారం విద్యార్థులకు మధ్యాహ్నాభోజనం అందేలా చూడాలన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి మురికి కాలువను, పారిశుద్ధ్య పనుల నిర్వహణ తీరును పరిశీలించారు. జీపీ కార్యదర్శి అనిత ఉన్నారు.