
మొదలైన చవితి సందడి
సాక్షి నెట్‌వర్క్: వినాయక చవితి పండగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మంగళవారం పండుగ వాతవరణం నెలకొంది. వివిధ గణేష్ మండళ్లు, గ్రామీణ ప్రాంతాల్లోని యువజన సంఘాలు, ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థలు మండపాలను సిద్ధం చేసుకుంటున్నాయి. చిన్న పిల్లలు ఇంటి వద్ద మట్టి విగ్రహాలు తయారు చేస్తూ కనపడ్డారు. మట్టి, పీవోపీ విగ్రహాలు, పూజా సామగ్రి, పూలు, పండ్లు, లడ్డూల విక్రయాలు జోరుగా సాగాయి. ఎప్పటిలాగే అధిక ధరలకు విక్రయాలు సాగాయి. నేడు వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నవరాత్రుల ఉత్సవాలు జరుపుతారు. చివరి రోజు పెద్ద ఎత్తున శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి. పండుగ సందర్భంగా చాలా చోట్ల వివిధ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో పర్యావరణహితమైన మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేశారు. మట్టి గణపతులను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలని వారు కోరారు.

మొదలైన చవితి సందడి

మొదలైన చవితి సందడి

మొదలైన చవితి సందడి

మొదలైన చవితి సందడి