
జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు నాగేశ్వరరావు ఎంప
కామారెడ్డి అర్బన్: ఎల్‌ఐసీ జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎల్‌ఐసీ కామారెడ్డి శాఖ హెచ్‌జీఏ కె.నాగేశ్వరరావు ఎంపికయ్యారు. ఎల్‌ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు కర్నాటకలో నిర్వహించగా సికింద్రాబాద్ డివిజన్ నుంచి కామారెడ్డికి చెందిన నాగేశ్వరరావు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పలువురు అభినందించారు. జాతీయ స్థాయి పోటీలకు నాగేశ్వరరావు ఎంపిక కావడం ఇది నాలుగోసారి అని ఎల్‌ఐసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తెలిపారు.
కామారెడ్డి అర్బన్: తమిళనాడులో సెప్టెంబర్ 5న అగ్నిపథ్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో క్లరికల్, టెక్నికల్ కేడర్‌లో యువతుల ఉద్యోగాల భర్తీకి ర్యాలీ నిర్వహిస్తున్నారని జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల యువతులు అగ్నిపథ్ వెబ్‌సైట్‌లో వివరాలు తెలుసుకోవచ్చని లేదా తమ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు.
బాన్సువాడ రూరల్: నానోయూరియా పిచికారీతో నేల, నీటి కాలుష్యం, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు తగ్గుముఖం పడతాయని బాన్సువాడ ఏడీఏ అరుణ అన్నారు. మంగళవారం ఆమె తాడ్కోల్ గ్రామంలో ఏవో ఫయాజుల్లా, ఏఈవోరాణి, రైతులతో కలిసి వరిపంట పొలాలను పరిశీలించారు. రైతులకు నానోయూరియా ప్రాముఖ్యతను వివరించారు. అరలీటర్ నానోయూరియా ఒక బస్తా యూరియా మందుతో సమానమన్నారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని పర్ణిక ప్యాలెస్‌లో ఉమ్మడి జిల్లా ప్రయివేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్య కమిటీ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎం. జైపాల్ రెడ్డి, కార్యదర్శిగా నరాల సుధాకర్, కోశాధికారిగా శ్రీనివాస్ రాజ్, ఉపాధ్యక్షులుగా అరుణ్ కుమార్, హకీమ్, అసోసియేట్ అధ్యక్షుడిగా సంజీవరెడ్డి, సహాయ కార్యదర్శులుగా రాజేశ్వరరావు, నవీన్ కుమార్, రాష్ట్ర కార్య నిర్వాహక సభ్యులుగా గురువేందర్ రెడ్డి, హరి ప్రసాద్‌లను ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమానులు హరిస్మరణ్ రెడ్డి, మారయ్య గౌడ్, శంకర్, సూర్య ప్రకాష్, సృజన్ రెడ్డి, బాలాజీ రావు, ప్రతాప్ రెడ్డి, గిరి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు నాగేశ్వరరావు ఎంప

జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు నాగేశ్వరరావు ఎంప