
మట్టి వినాయకులతో పర్యావరణానికి మేలు
రాజంపేట: మట్టి వినాయకులతో పర్యావరణానికి హాని కలగదని ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ రమేష్ పేర్కొన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించకుని కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో మట్టి వినాయక విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మట్టితో గణేశుడి విగ్రహాలను తయారు చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో మట్టి గణేశ విగ్రహాల ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిప్యూటి రేంజ్ ఆఫీసర్ శ్రీధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.