
సమాచారహక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం
భిక్కనూరు: సమాచారహక్కు చట్టం ప్రజల చేతిలో వజ్రాయుధం వంటిదని సమాచారహక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ సలీం అన్నారు. మంగళవారం జంగంపల్లి మహాత్మాజ్యోతిభాపూలే పాఠశాల/కళాశాలలోలో నిర్వహించిన సమాచార హక్కు చట్టం 2005, విద్యాహక్కు చట్టంపైన అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సమాచారహక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రిన్సిపాల్ శ్రీలత, కమిటీ రాష్ట్ర సలహాదారు కేతు రమణారెడ్డి, స్పోక్స్‌మాన్ శ్రీనివాసరావు, నిజామాబాద్ జిల్లా మహిళ అధ్యక్షులు రషీదాబేగం, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.