
జిల్లా కేంద్రంలో 2కే రన్
కామారెడ్డి క్రైం: మేజర్ ధ్యాన్‌చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి యేటా నిర్వహించే క్రీడా దినోత్సవం సందర్భంగా 10 రోజుల పాటు జరిగే వివిధ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో 2కే రన్ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు రన్‌ను చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఏఎస్పీ చైతన్యారెడ్డి, ఆర్డీవో వీణ కాగడా వెలిగించి, జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, కార్యదర్శి అనిల్ కుమార్, టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: జిల్లాలో యూరియా కొరత తీర్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో కలెక్టర్, జిల్లా వ్యవసాయాధికారికి వినతి పత్రం అందజేశారు. బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో యూరియా కొరత, ఇతర సమస్యలను వివరించారు. పొట్ట దశలో ఉన్న వరి, మక్కకు యూరియా వేయకుంటే దిగుబడి రాక రైతాంగం భారీ నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అధికారులు తక్షణం స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు. బీకేఎస్ ప్రతినిధులు శంకర్‌రావు, ఆనందరావు, సాయిరెడ్డి, రమణారెడ్డి, గోపాల్‌రెడ్డి, చిన్న అంజన్న, కృష్ణారెడ్డి, బాపురెడ్డి పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి: పాత పెన్షన్ పోరాట సభను విజయవంతం చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ కో– చైర్మన్ అనిల్‌కుమార్ అన్నారు. మంగళవారం మత్తమాల జెడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి ఆయన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా హైదరాబాద్‌లో సభ ఏర్పాటు చేశామన్నారు.

జిల్లా కేంద్రంలో 2కే రన్