
‘ఒకటిన పెన్షన్ విద్రోహ దినం’
కామారెడ్డి అర్బన్ : పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ ఒకటో తేదీన కలెక్టరేట్‌లో పెన్షన్ విద్రోహ దినం నిర్వహించనున్నట్లు ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ వెంకట్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం జేఏసీ ప్రతినిధులు కలెక్టరేట్‌లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, కరువు భత్యాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి దేవేందర్, ప్రతినిధులు నాగరాజు, సాయిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, లింగం, నర్సింహరెడ్డి, హన్మంత్‌రెడ్డి, మనోహర్‌రావు, భాస్కర్‌రెడ్డి, బషీర్, ముజీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.