
అంచనాలకు మించి సాగు
జిల్లాలో సాగైన వివిధ పంటల వివరాలు.. (ఎకరాలలో)
ఎల్లారెడ్డిరూరల్ : జిల్లాలో వానాకాలం సీజన్‌లో వ్య వసాయ శాఖ అధికారుల అంచనాలకు మించి పంటలు సాగయ్యాయి. అన్ని పంటలు కలిపి 5.30 లక్ష ల ఎకరాలుండగా.. ఇందులో ఒక్క వరి పంటే 2.92 లక్షల ఎకరాలలో సాగవుతుండడం గమనార్హం.
వానాకాలం ప్రారంభానికి ముందే జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రైతులు ముందస్తుగానే పంటల సాగు మొదలుపెట్టారు. మధ్యలో వర్షాలు లేకపోవడంతో ఆందోళన వ్యక్తమైనా ఇటీవల కురిసిన వర్షాలతో అన్నదాతలు ఊరట చెందారు. వరి సాగు విస్తీర్ణం అంచనాలకు మించింది. 2,92,786 ఎకరాలలో వరి సాగవుతుందని అంచ నా వేయగా.. 3,10,573 ఎకరాలలో నాట్లు వేశారు. పత్తి సాగు మూడింతలైంది. రైతులు అంచనాల కన్నా రెట్టింపు విస్తీర్ణంలో కంది సాగు చేశారు. రైతు లు పెసర్లు, మినుముల సాగును సగానికన్నా తగ్గించారు. సోయా, మక్కతోపాటు ఇతర పంటల సాగు కూడా తగ్గింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని నిజాంసాగర్, పోచారం, కల్యాణి ప్రాజెక్టులు, సింగితం రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండాయి. దీంతో పాటు గ్రామాలలోని చెరువులు, కుంటలు చాలావరకు నిండుకుండల్లా మారి పంట ల సాగుకు అనుకూలంగా ఉన్నాయి. భారీ వర్షాల తో భూగర్భ జలాలు సైతం పెరగడంతో బోరుబావుల కింద సాగవుతున్న పంటలకు కూడా ఢోకా లే కుండా పోయింది. దీంతో వేసిన పంటలు గట్టెక్కుతాయన్న ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణానికి మించి పంట లు సాగవుతున్నాయి. ఈనెలాఖరు వరకు వరి నా ట్లు వేసుకునే అవకాశాలున్నాయి. దీంతో సాగు విస్తీ ర్ణం మరింత పెరుగుతుందని భావిస్తున్నాం.
– మోహన్‌రెడ్డి,
జిల్లా వ్యవసాయ అధికారి, కామారెడ్డి
పంటలు సాగు సాగు
అంచనా విస్తీర్ణం
వరి 2,92,786 3,10,573
మక్క 59,550 50,736
పత్తి 11,700 31,529
సోయా 86,431 80,083
కందులు 26,662 50,511
పెసర్లు 8,129 3,192
మినుములు 5,842 2,557
ఇతర పంటలు 8,120 1,120
మొత్తం 4,99,220 5,30,301
5.30 లక్షల ఎకరాల్లో
వివిధ రకాల పంటలు..
అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న వరి
భారీ వర్షాలతో పంటలకు
ఢోకా లేనట్లేనంటున్న రైతులు