ఏకంగా ఎమ్మెల్యే పేరుతోనే.. ఇన్‌స్ట్రాగాంలో.. చివరికి.. | - | Sakshi
Sakshi News home page

ఏకంగా ఎమ్మెల్యే పేరుతోనే.. ఇన్‌స్ట్రాగాంలో.. చివరికి..

Aug 5 2023 1:30 AM | Updated on Aug 5 2023 11:28 AM

- - Sakshi

నిజామాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా ఎమ్మెల్యే పేరుతో ఇన్‌స్ట్రాగాంలో ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసిన ఘటన వెలుగు చూసింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ పేరుతో ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసిన దుండగులు.. డబ్బులు అడుగుతున్నారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు మిగతావారిని అప్రమత్తం చేశారు. దుండగులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే పేరుతో ఫేక్‌ ఇన్‌స్టాగ్రాం ఖాతా తెరిచారని, డబ్బులు అడుగుతున్నారని ఎమ్మెల్యే పీఏ తెలిపారు. దానికి ఎవరూ స్పందించవద్దని, ఫేక్‌ అకౌంట్‌ను అందరూ బ్లాక్‌ చేయాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement