బీబీపేట: సీ్త్రనిధి రాష్ట్ర డైరెక్టర్‌గా బీబీపేట మండల సమాఖ్య అధ్యక్షురాలు సాదల స్రవంతి ఎన్నికయ్యారు. బుధవారం హైదరాబాద్‌లో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 20 డైరెక్టర్ పదవులకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా.. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు కలిపి ఒక డైరెక్టర్ పదవి కేటాయించారు. ఈ డైరెక్టర్ పరిధిలో కామారెడ్డి జిల్లాలో 20 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మంది ఓట్లు వేశారు. సాదల స్రవంతికి 20 ఓట్లు రాగా రాజన్న సిరిసిల్ల జిల్లానుంచి బరిలో ఉన్న లింగారెడ్డిగారి భాగ్యకు 12 ఓట్లు వచ్చాయి. దీంతో స్రవంతి డైరెక్టర్‌గా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించి, ఎన్నిక పత్రం అందించారు.
కామారెడ్డి టౌన్ : జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు రవీందర్‌నాయక్ వైద్యాధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో జిల్లాలోని పీహెచ్‌సీల వైద్యాధికారులతో ఆ యన జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పు రోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. విషజ్వరాలు, డెంగీ, మలేరియా, టై ఫాయిడ్ వంటి వ్యాధులు సోకకుండా ముంద స్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈగలు, దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల పనితీరును ప్రోగ్రామ్ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటి, వివిధ ప్రోగ్రామ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బాన్సువాడ : అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా చూడాలని బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు నీలం చిన్న రాజులు పార్టీ బూత్ లెవ ల్ ఏజెంట్లకు సూచించారు. బాన్సువాడలో ఆ యన బుధవారం బీఎల్‌ఏలతో సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు ఎన్యుమరేషన్ ఫారాలు సమ ర్పించని ఓటర్లను గుర్తించి, వారు ఫారాలు బీఎల్‌వోలకు అందించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కోనాల గంగారెడ్డి, చీదరి సాయిలు, శంకర్‌గౌడ్, హన్మండ్లు, పాశం భాస్కర్‌రెడ్డి, భూమేష్ తదితరులు పాల్గొన్నారు.
● తప్పిన ప్రమాదం
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ బాలికల హాస్టల్‌లో మంగళవారం రాత్రి ఓ విద్యార్థిని పాము కాటుకు గురైన ఘటన కలకలం రేపింది. అర్థశాస్త్రం ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని కవిత హాస్టల్ వరండాలో నడుస్తుండగా కాలుపై పాము కాటేసింది. విషయాన్ని హాస్టల్ సిబ్బందికి చెప్పడంతో అప్రమత్తమై యూనివర్సిటీ అంబులెన్స్‌లో డిచ్‌పల్లి ప్రభుత్వ 30 పడకల ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే వర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి హాస్టల్‌కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. చీఫ్ వార్డెన్ రవీందర్‌రెడ్డి, వార్డెన్ జ్యోత్స్నతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చికిత్స అనంతరం విద్యార్థిని కవిత శరీరంలో విషపు ఆనవాళ్లు లేకపోవడంతో బుధవారం వైద్యులు ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. అయితే మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల వరకు క్యాంపస్‌లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో చీకట్లో ఇబ్బందులు పడినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. బాలికల హాస్టల్ కిటికీలకు జాలీలు లేకపోవడంతో విష పురుగులు, పాములు గదుల్లోకి వస్తున్నాయని, సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.


