నాకు బోర్లగూడెంలో నాలుగు ఎకరాల భూమికి 2022లో అటవీ హక్కు పట్టా వచ్చింది. కానీ ఆ భూమి ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని బ్యాంకులో చెపుతున్నారు. క్రాప్ లోన్ ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు బ్యాంకుకు వెళ్లినా స్పందించడం లేదు. ధరణిలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడేమో భూభారతిలో నమోదు కాలేదని అంటున్నారు. సాగు పెట్టుబడికి డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించి పోడు రైతులకు పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలి.
– ముకులోత్ కమల,
బోర్లగూడెం, మహాముత్తారం


