పకడ్బందీగా డేంజర్‌ జోన్‌ ఇళ్ల్ల సర్వే | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా డేంజర్‌ జోన్‌ ఇళ్ల్ల సర్వే

Jul 18 2026 3:41 AM | Updated on Jul 18 2026 3:41 AM

మల్హర్‌(కాటారం): ఓపెన్‌కాస్ట్‌కు 500 మీటర్ల దూరంలోని మండలంలోని పెద్ద తాడిచర్ల పరిధిలోని డేంజర్‌ జోన్‌లో ఉన్న ఇళ్ల సర్వేను అత్యంత సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని కాటారం ఆర్డీఓ రవీందర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రం తాడిచర్ల తహసీల్దార్‌ కార్యాలయంలో ఐదు ప్రత్యేక సర్వే బృందాలతో ఆర్డీఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే బృందాలకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. పొరపాట్లకు తావులేకుండా పక్కాగా వివరాలు నమోదు చేయాలని స్పష్టంచేశారు. సమన్వయంతో పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. డేంజర్‌ జోన్‌లో ఉన్న ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి, నివేదికలను సిద్ధం చేయాలన్నారు. అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రవికుమార్‌, సర్వే బృందాల సభ్యులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

కాటారం ఆర్డీఓ రవీందర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement