రీ సర్వే పకడ్బందీగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

రీ సర్వే పకడ్బందీగా పూర్తి చేయాలి

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

జగిత్యాలరూరల్‌: భూముల రీ సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నా రు. బీర్‌పూర్‌ మండలం మోతినగర్‌లో సిబ్బంది చేస్తున్న సర్వేను గురువారం పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత విస్తీర్ణంలో పూర్తయింది..? ఇంకా ఎంత చేపట్టాల్సి ఉంది..? అని రెవెన్యూ అధికా రులను అడిగి తెలుసుకున్నారు. సర్వే నంబర్ల వా రీగా పొరపాట్లు లేకుండా చూడాలని సూచించా రు. గ్రామ సరిహద్దులు నిర్ధారించి, ఆధునిక సాంకేతికత, అత్యాధునిక పరికరాలతో వ్యవసాయ భూములను సర్వే చేస్తున్నామని తెలిపారు.

నాణ్యమైన భోజనం అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్‌ సూచించారు. బీర్‌పూర్‌లోని కేజీబీవీని తనిఖీ చేశారు. వంటలు, కిచెన్‌, స్టోర్‌రూం పరిశీలించారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల భోదనపై అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో మధుసూదన్‌, తహసీల్దార్‌ సుజాత, సర్వేయర్‌, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement