మెట్‌పల్లి: పట్టణంలో వినాయక నిమజ్జన శోభా యాత్రలో ఉద్రికత్త చోటు చేసుకుంది. మెట్‌పల్లిలో బుధవారం ఉదయం నిమజ్జన వేడుకలు ప్రారంభం కాగా.. సాయంత్రం వర్షంతో అంరాయం ఏర్పడింది. దీంతో శోభాయాత్ర గురువారం కూడా కొనసాగింది. కొన్ని ఉత్సవ కమిటీలు శోభాయాత్రను ముగించే విషయంలో జాప్యం చేయడంపై పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీనికి ఓ కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు లాఠీలతో చెదరగొట్టే ప్రయత్నం చేయగా.. పలువురికి గాయాలయ్యాయి. అనంతరం పోలీసుల తీరును నిరసిస్తూ వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. తర్వాత పోలీసులే నచ్చజెప్పడంతో ఆందోళన విరమించి నిమజ్జనానికి తరలివెళ్లారు.


