నేడు, రేపు భారీ వర్షం | - | Sakshi
Sakshi News home page

నేడు, రేపు భారీ వర్షం

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

జగిత్యాలఅగ్రికల్చర్‌: వాయుగుండం ప్రభావంతో జిల్లాలో రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. బలమైన ఈదురుగాలులకు చేతికొచ్చిన మక్క నేలవాలింది. మల్యాలలో గురువారం అత్యధికంగా 85 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. కొడిమ్యాల మండలం పూడూరులో 78.3, కథలాపూర్‌లో 70.3, ధర్మపురి మండలం నేరెళ్లలో 65, రాయికల్‌లో 63.8, ఎండపల్లి మండలం గుల్లకోటలో 61.5, జగిత్యాలలో 60.3, బీర్‌పూర్‌ మండలం కొల్వాయిలో 59, కోరుట్లలో 58.8, మేడిపల్లి మండలం గోవిందారంలో 57.8, వెల్గటూర్‌లో 55.3, మల్లాపూర్‌లో 53.8, సారంగాపూర్‌లో 52.5, జగిత్యాల రూరల్‌ మండలం పొలాస, మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌లో 51.3 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

నేలవాలిన మక్క

కంకి దశకు చేరుకున్న మక్క నేలవాలింది. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడం.. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పంట నేలవాలింది. వర్షాలు మరో రెండు రోజులపాటు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

భారీ వర్ష సూచన

జిల్లాలో శుక్రవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. వాయుగుండం ఉత్తర, వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీన పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మల్యాలలో అత్యధికంగా 85 మిల్లీమీటర్లు

నేలకొరిగిన మొక్కజొన్న పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement