వెల్గటూర్: గోదావరి పుష్కరాలకు ముందే కోటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కోటిలింగాలలో ఆలయ పునర్నిర్మాణం, రాజగోపురం, పుష్కరఘాట్లకు కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. పుష్కరాల కోసం ప్రభుత్వం రూ.117 కోట్లు కేటాయించిందని, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క రూ.81 కోట్లు కేటాయించారని తెలిపారు. పనులను వచ్చే ఫిబ్రవరిలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, తహసీల్దార్ శేఖర్, ఎంపీడీవో వెంకట్ ప్రసాద్, ఆలయ కమిటీ చైర్మన్ పూదరి రమేశ్, ఏఎంసీ చైర్మన్ తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శైలేందర్‌రెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వయోవృద్ధుల వారోత్సవాల పోషణ సంరక్షణ చట్టం పుస్తకాన్ని ఆవిష్కరించారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్


